నేడు భారత్ లో ధురంధర్-2 ఓటీటీ ప్రీమియర్.. ఎక్కడంటే...!
- ప్రపంచవ్యాప్తంగా రూ. 1,780 కోట్లు కొల్లగొట్టిన బ్లాక్‌బస్టర్
- జియోహాట్‌స్టార్‌లో ‘రా అండ్ అన్‌దేఖా’ వెర్షన్‌గా విడుదల
- జూన్ 5 నుంచి అందుబాటులోకి రానున్న పూర్తి సినిమా
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన స్పై-థ్రిల్లర్ 'దురంధర్: ది రివెంజ్' ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. థియేటర్లలో రికార్డుస్థాయి వసూళ్లు సాధించిన ఈ చిత్రం, ఈరోజు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్‌లో డిజిటల్ ప్రీమియర్‌గా అడుగుపెడుతోంది. 'రా అండ్ అన్‌దేఖా' పేరుతో, థియేటర్లలో లేని అదనపు సన్నివేశాలతో ఈ వెర్షన్‌ను ప్రత్యేకంగా విడుదల చేస్తున్నారు.
ఈరోజు సాయంత్రం 7 గంటలకు జియోహాట్‌స్టార్‌లో ఒక ప్రత్యేక డిజిటల్ ప్రీమియర్ ఈవెంట్ జరగనుంది. ఇందులో సినిమా మేకింగ్ వీడియోలు, నటీనటుల ముచ్చట్లను ప్రసారం చేస్తారు. పూర్తి సినిమా మాత్రం జూన్ 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంటుంది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. దేశీయంగా రూ. 1,374 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 1,780 కోట్లకు పైగా వసూలు చేసి ఇటీవలి కాలంలో అతిపెద్ద కమర్షియల్ హిట్‌లలో ఒకటిగా నిలిచింది.
2025లో వచ్చిన 'దురంధర్' చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ అండర్‌కవర్ స్పై హమ్జా అలీ మజారీ పాత్రలో కనిపించారు. ప్రతీకారం తీర్చుకునే క్రమంలో అతను చేసే యాక్షన్ విన్యాసాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.
ఇప్పుడు ఓటీటీలో విడుదలవుతున్న వెర్షన్‌లో థియేటర్లలో తొలగించిన సీన్లు, డైలాగులు, పొడిగించిన యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని, ఇది ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం తెలిపింది. సాధారణంగా భారీ బడ్జెట్ చిత్రాలు థియేటర్లలో విడుదలైన 60-70 రోజుల తర్వాత ఓటీటీలోకి వస్తుంటాయి. 'దురంధర్' కూడా అదే పద్ధతిని అనుసరించింది.